ప్రేమ పెళ్లైనా.. పెద్దల కుదిర్చిన పెళ్లయినా.. పెళ్లయ్యాక భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది కాస్త కొరవడిందనే చెప్పాలి. సామాజిక వెబ్ సైట్ల పుణ్యమా అని భార్యాభర్తల సంబంధాలు సైతం పెటాకులైపోతున్నాయి. వీటికి తోడు బిజీ లైఫ్, ఉద్యోగాలు వంటివి పెళ్లయ్యాక దంపతుల మధ్య చాలా బ్రేక్ ఇస్తున్నాయి. భర్తను లేదా భార్యను పెళ్లికి తర్వాత కూడా ప్రేమించాలంటే.. వారిని ఆకట్టుకునే విధంగా డ్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. శైలి, ప్రాధాన్యతను సమయానికి తగ్గట్టు మార్చుకోవాలి. మంచి డ్రెస్ కాంబినేషన్‌తో పాటు అతనికి ఇష్టమైన సువాసనతో కలిగిన సెంట్‌ను యూజ్ చేస్తే సర్ ప్రెజ్ ఇచ్చినట్లవుతుంది.
మీ బిజీ జీవితాల కారణంగా కలిసి సమయం గడపటానికి సమయం ఉండకపోవచ్చు. ఇద్దరు కలిసి సమయం గడపటానికి ఉన్న మార్గాల గురించి తెలుసుకోండి. ఇద్దరు కలిసి రొమాంటిక్ వాక్ చేయొచ్చు. ఇద్దరు డాబా మీద కూర్చొని ఆకాశంలో నక్షత్రాలను చూడవచ్చు. ఇద్దరు కలిసి మీ ఇంటిలో క్యాండిల్లైట్ డిన్నర్‌తో కొంత సమయాన్ని గడపవచ్చు. ఇది ఖచ్చితంగా మీ వైవాహిక జీవితంలో ఒక కొత్త ఆకర్షణను జోడిస్తుంది.
కాబట్టి, మీ చర్యల ద్వారా దానినే చూపించండి. ఆ సమయంలో ఒకసారి, మీరు అతని లంచ్ బాక్స్‌లో లక్కీ అని ఒక చిన్న నోట్ పెట్టండి. అతను ఆఫీసు నుండి తిరిగి వచ్చినప్పుడు కౌగిలి మరియు ముద్దు పెట్టండి. ఈ చిన్న హావభావాలు తప్పనిసరిగా ప్రేమను చిగురింపజేస్తుంది.