ప్రేమిస్తున్నాడా లేక నటిస్తున్నాడా? నమ్మేదెలా?

బుధవారం, 13 జనవరి 2016 (11:24 IST)
మీ ప్రియుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేడా అని తెలుసుకోడానికి అతను మీకు "ఐ లవ్ యూ" అని చెప్పనసరం లేదు. "ఐ లవ్ యూ" చెప్పకుండానే అతనిలోని భావాన్ని ఈ మార్పులతో గమనించవచ్చు. అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేక నటిస్తున్నాడా అని ఈ మార్పుల ద్వారా తెల్సుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం! 
 
మీరు చాలా కాలం క్రితం మర్చిపోయిన చిన్న చిన్న విషయాలను అతడు గుర్తు చేస్తే అతడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లు అర్ధం. ఉదాహరణకు మీకు నచ్చిన రంగు, సినిమా, మొదటి పరిచయంలో మీరు తెలిపిన విషయాలు, మీ పుట్టిన రోజుకి మీకు ఏమి కావాలో, అతనికి మీరు చెప్పిన చిన్ననాటి జ్ఞాపకాలు... ఇలాంటివి మీకు గుర్తు చేసినట్లయితే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే అని తెలుసుకోండి.
 
మీ స్నేహితుల గురించి మీరు చెప్పే కథలు అతడు శ్రద్ధగా వింటే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు. మీ స్నేహితులను గౌరవించడం, మీకు ముఖ్యమైన వ్యక్తుల పుట్టిన రోజు పండుగలకు అతను హాజరవడం కూడా ఇందులో భాగమే. అయితే ఇలాంటి సందర్భాల్లో అతడు మీతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడక, మీతో చిరాకుగా ఉన్నట్లయితే అతను మిమ్మల్ని ప్రేమించట్లేదని అర్ధం చేసుకోండి.
 
మీకు అతని అవసరం ఉన్నపుడు తన ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లయితే అతను మిమ్మల్నినిజంగానే ప్రేమిస్తున్నాడనటానికి ఇదే పెద్ద సంకేతం. ఎందుకంటే అతడు మీ అభిప్రాయాలను గౌరవిస్తూ.. మీకు అండగా ఉంటాడు. అంతే కాకుండా అతడు సరైన సమయానికి సరైన స్థలంలో ఉన్నట్లు అర్ధం.
 
మీకు సంతోషం కలిగించే విషయాలు, వస్తువులను అతడు ఆకస్మాత్తుగా మీ ముందు ఉంచితే తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్ధం. ఉదాహరణకు బహుమతులు అందచేయడం, ప్రత్యేక కారణం ఏదీ లేకపోయినప్పటికీ మీకు నచ్చిన కొన్ని విషయాలలో శ్రద్ధ చూపడం లాంటివి చేస్తే అతనికి మీరంటే ఇష్టం అని తెలుసుకోండి.
 
మీకు అతని అవసరం ఉన్నపుడు తన ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లయితే అది తను మీపై పెంచుకున్న ప్రేమకు సూచకం. నిజానికి ఇదే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనటానికి పెద్ద సంకేతం. ఎందుకంటే అతడు మీ అభిప్రాయాలను గౌరవిస్తూ.. మీకు అండగా ఉంటాడు. అంతే కాకుండా అతడు సరైన సమయానికి సరైన స్థలంలో ఉన్నట్లు అర్ధం.
 
మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలో అతడు మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్ధం. ఈ బంధం మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. 
 
పైన చెప్పిన విషయాలన్నీ మీరు అతనిలో గమనించండి. ఒక వేళ అవన్నీ కనుక జరిగితే అతడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు. అంతేకాకుండా అతడు మీ సంతోషం కోసం ఏదైనా చెయ్యగలడని మీకు తెలిస్తే అతను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు అని అర్ధం.

వెబ్దునియా పై చదవండి