ప్రేమ అనేది ఏదో కొంతకాలం ఉండిపోయేది కాదు. రూపం మారినంత మాత్రానో, బంధం వల్లనో, వయసైనందువల్లనో తరిగిపోయేదీ కాదు. ప్రేమ గొప్పతనాన్ని గుర్తించడానికి గడచిన కాలాన్ని నెమరువేయటం అనేది దురదృష్టకరమైన విషయం.
వైద్యపరంగా ఏవిధమైన వివరం తృప్తినివ్వలేదు. వైద్యనిపుణులకు ఏదీ ఆనందాన్నివ్వలేదు. ఆ సమయంలో ఏదాన్నా భూతప్రేతాలవంటి అమానుష్య శక్తి ఏదన్నా సరే దాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. నిర్ణయించుకున్న రోజున ప్రతి డాక్టర్ తన ఇష్టదైవాన్ని జపిస్తూ, అక్కడ ఒకపక్క దాక్కుకున్నారు.