అసలే సోషల్ మీడియా క్రేజ్. సెల్ఫీల పిచ్చితో యువత ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇందుకు తోడుగా అందంపైనే ప్రస్తుతం యువత ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అందంకోసం పాకులాడేది అమ్మాయిలే కాదని అబ్బాయిలు కూడాని తేలింది. అందంగా కనిపించేందుకు యువతులు రకరకాల క్రీములు వాడేస్తుంటారు. బ్లీచింగ్, ఫేషియల్‌తో పాటు ఇతరత్రా ట్రీట్‌మెంట్లతో అమ్మాయిలు అందంగా కనిపించేందుకు బాగానే కనిపిస్తుంటారు.
అయితే ప్రస్తుతం సీన్ రివర్సైంది. అమ్మాయిల కంటే అబ్బాయిలే బ్యూటీపార్లర్లకు వెళ్తున్నారు. ఫేషియల్, బ్లీచింగ్, హెయిర్ కటింగ్ స్కిన్ ట్రీట్మెంటలతో దూసుకెళ్తున్నారు. ఫేషియల్, బ్లీచ్‌ల కోసం వేలు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలను సులభం ఆకర్షించేందుకే అందం పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.