అంతా శివమయం

ఆదిలో సృష్టి నిమిత్తమై బ్రహ్మ తపస్సు మేరకు మార్గదర్శన నిమిత్తం పరమేశ్వరుడు అర్థనారీశ్వర రూపంలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత స్త్రీ పురుష రూపములుగా విభక్తి చెంది పార్వతీ పరమేశ్వర రూపములొంది ఆదిదంపతులై సృష్టికారకులయ్యారు.

శివుడు పంచాననుడై, పంచాకృతుడై, పంచభూతాత్మకుడై, త్రిగుణాత్మకుడై, త్రిలోచనుడై, అష్టదిక్కులే అంబరముగా సర్వము తనయందే నిలిపి, సర్వమునందు తనే వ్యాపించి, తన చైతన్య శక్తిచే సర్వప్రాణకోటికి పశుపతియై, జగత్తే శివం, శివమే జగత్తుగా, అంతా శివమయమై యున్నాడు.

వెబ్దునియా పై చదవండి