శివరాత్రి వ్రతం... శ్రీ మహా విష్ణువు చక్రాయుధంతో శ్రీలక్ష్మిని పొందాడు..

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (10:38 IST)
Lord Shiva
తెల్లవారుజామున శివుని పూజిస్తే రోగాలు నయమవుతాయి. రోజు ఉదయం పూట శివపూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. రాత్రిపూట పూజ చేస్తే మోక్షం లభిస్తుంది. శివరాత్రి పర్వదినాన శివాలయాలను సందర్శించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. 
 
శివరాత్రి వ్రతం ద్వారా శ్రీ మహా విష్ణువు చక్రాయుధంతో శ్రీలక్ష్మిని పొందాడని, బ్రహ్మకు సరస్వతి లభించిందని పురాణాలు చెబుతున్నాయి.
 
ఒక సంవత్సరం శివరాత్రి ఉపవాసం వంద అశ్వమేధ యాగాలకు సమం. అనేక గంగాస్నానాలకు సమానం. శివరాత్రి వ్రతాన్ని వయస్సు, కుల, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు.
 
శివరాత్రి నాడు సాయంత్రం సూర్యాస్తమయం నుండి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం వరకు శివపూజ చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి పూజ చేస్తే పుత్ర దోషం, వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.
 
శివరాత్రి నాడు వీలైనంత వరకు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా సక్రమంగా పూజించడం వల్ల  మోక్షాన్ని పొందవచ్చు. శివార్చన, పంచాక్షరీ మంత్రంతో శివుడిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు