భారత్‌కు "పర్యావరణ పరిరక్షణ" అవార్డు

అమెరికాలోని ప్రముఖ పర్యావరణ సంస్థ అందజేసే అవార్డును 2009 సంవత్సరానికిగానూ భారతదేశం చేజిక్కించుకుంది. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి లోయల పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును అమెరికాలోని "సెరియో క్లబ్" సంస్థ ప్రకటించింది.

బేర్‌ఫుట్ కాలేజీలో గ్రామీణ పౌరులకు, మహిళలకు బేర్‌ఫుట్ సోలార్ ఇంజనీర్లుగా శిక్షణ ఇస్తున్నందుకు, స్పితి లోయ పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును సెరియో క్లబ్ సంస్థ అందజేయనుంది. ఈ అవార్డు కింద 20 లక్షల రూపాయలను అందజేయనున్నారు. కాగా ఈ అవార్డును జూలై 30వ తేదీన ముంబై నగరంలో ప్రదానం చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి