అంతరిక్ష కమిషన్ పదనికి నరసింహ రాజీనామా?

శనివారం, 25 ఫిబ్రవరి 2012 (09:49 IST)
ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందంలో అవతవకలకు పాల్పడారన్న ఆరోపరణలు ఎదుర్కొంటున్న ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్, మరో ముగ్గురుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై కినుక వహించిన అంతరిక్ష అగ్రశ్రేణి శాస్త్రవేత్త రొద్దం నరసింహ తన అంతరిక్ష కమిషన్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

ఈ వివాదాస్పద ఒప్పందానికి సంబంధిన దర్యాప్తులో భాగంగా ప్రధాన మంత్రి నియమించిన ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీలో సభ్యునిగా కేంద్ర మంత్రిమండలి మాజీ కార్యదర్శి బీకే చతుర్వేదితో కలసి దర్యాప్తు కూడా చేపట్టారు. తమ నివేదికను గత ఏడాది మార్చి 12 వతేదీన ప్రభుత్వానికి సమర్పించారు. నరసింహ తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కాగా రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయలో సహాయ మంత్రి వి.నారాయణస్వామి కోరారు. దీనిపై మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ప్రొఫెసర్ నరసింహ చాలా గొప్ప శాస్త్రవేత్త అని ఆయన అంటే మాకు గౌరవభావం అని తెలిపారు. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి