అణు భద్రతపై సదస్సు: అమెరికాకు ప్రధాని మన్మోహన్!

PTI
వాషింగ్టన్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే అణు భద్రత సదస్సులో పాల్గొనేందుకుగాను దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం అమెరికాకు బయలుదేరారు. ఈ సదస్సులో 47 దేశాలు పాల్గొంటున్నాయి. అణుశక్తి భద్రత, తీవ్రవాదులకు అణ్వాయుధాలు లభ్యమవడాన్ని పూర్తిగా అరికట్టేందుకుగాను పలుదేశాలు ఈ సదస్సులో చర్చలు జరుపనున్నాయి.

అలాగే ఇరాన్ అణ్వాయుధాల తయారీని తక్షణమే ఆపివేయాలనే అంశంపై కూడా ప్రపంచ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు చర్చలు జరుపుతారు. ఈ సదస్సులో పాల్గొనేందుకుగాను శనివారం అమెరికాకు బయలుదేరే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం (ఏప్రిల్ 11వతేదీ) అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవుతారు.

అలాగే రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటించే ప్రధాని మన్మోహన్ సింగ్ అణు సదస్సు ముగిసిన తర్వాత బ్రెజిల్‌లో జరిగే బ్రిక్ (బ్రెజిల్-రష్యా-ఇండియా-చైనా) (బీఆర్ఐసీ) జరిగే మరో సదస్సులో పాల్గొంటారు.

వెబ్దునియా పై చదవండి