అనుకున్నట్టుగానే తీరం దాటిన ఫయాన్

గురువారం, 12 నవంబరు 2009 (10:58 IST)
ముంబై సమీపంలో ఫయాన్ తుఫాన్ తీరాన్ని దాటింది. దీంతో తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారిందని, ప్రస్తుతం ఇది దక్షిణ గుజరాత్-ఉత్తర మహారాష్ట్ర సరిహద్దు భూభాగంపై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఫయాన్ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారడంతో గుజరాత్, మహారాష్ట్రలతోపాటు గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి