అరుదైన బ్రహ్మచారి రాహుల్ గాంధీ

గురువారం, 31 డిశెంబరు 2009 (10:03 IST)
దేశ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీ దేశంలోనే అత్యంత అర్హుడైన బ్రహ్మచారిగా నిలిచారు.

భారత మాట్రిమోని డాట్ కామ్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగి, అర్హుడైన బ్రహ్మచారిగా రాహుల్ గాంధీ పేరు ముందుండటం విశేషం. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని, బాలీవుడ్ ప్రముఖ యువ నటుడు షాహీద్ కపూర్, జాన్ అబ్రహాంలను రాహుల్ వెనక్కి నెట్టడం మరో విశేషం.

ఆన్‌లైన్ సర్వేలో వీరికి వచ్చిన ఓట్ల శాతం ఇలావుంది... రాహుల్ గాంధీకి 30 శాతం మంది ఓట్లు వేయగా ధోని 21.1 శాతం, షాహీద్ 13 శాతం, జాన్ అబ్రహాం 10.7 శాతం ఓట్లు పొందారు. అలాగే బ్రహ్మచారిణిల జాబితాలో మత్తెక్కించే కళ్ళున్న కత్రినా కైఫ్ ముందు వరుసలో నిలవడం విశేషం. ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్న ప్రజలు ఆమెకు 27.5 శాతం మంది మద్దతిచ్చారు. విద్యాబాలన్‌కు 22.7 శాతం, ప్రియాంక చోప్రాకు 18.7 శాతం, దీపికా పదుకొనేకు 13.3 శాతం మంది మద్దతినట్లు సర్వే నిర్వహించిన సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి