ఉత్తర ప్రదేశ్‌లో వెల్లువెత్తుతున్న వరదలు

మంగళవారం, 5 ఆగస్టు 2008 (16:51 IST)
ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన నదులు వరద పోటెత్తటంతో అనేక ప్రాంతాలు జలమయమై వేలాది సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని లక్నో పరిసర ప్రాంతాల్లో గోమతీ నది వరద ఉధృతికి అనేక గ్రామాలు జలమయయ్యాయి. దీంతో ఆయా గ్రామ ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించారు.

రాష్ట్రంలోని అనేక నదులు కూడా వరదలతో పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురవడం తగ్గినా నదులు మాత్రం ప్రమాద సూచికకు ఎగువన ప్రవహిస్తున్నాయి. అనేక దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర ప్రదేశ్ అధికారుల లెక్కల ప్రకారం 311 గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి. ఇప్పటివరకూ 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను వేగిరం చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో చర్యలు చేపట్టేందుకు వీలుగా మొబైల్ బృందాలను ఏర్పాటుచేశారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. శారద, ఘాగ్రా, రప్తి, బుథీ రప్తి, కువానో నదులు ప్రమాద సూచికకు ఎగువన ప్రవహిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి