ఎన్నికలు ముగిసే వరకు పెట్రోల్ ధరలు పెంచొద్దన్న కేంద్రం!?

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతో పాటు ఐదు రాష్ట్రాల్లో శాససనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకూడదని చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకూడదని ఆయా ఆయిల్ సంస్థలకు ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచాలని చమురు సంస్థలను కేంద్ర పబ్లిక్ సర్వీస్ అధికారులు ఒత్తిడి చేసిన నేపథ్యంలో, ఎన్నికల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ పెంచకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారాను కేంద్ర ఎన్నికల సంఘం మోగించిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎస్.వై.ఖురేషీ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి