ఏకీకృత విద్యావిధానం తక్షణ అమలు: జయలలిత

రాష్ట్రంలో తక్షణం ఏకీకృత విద్యా విధానాన్ని అమలు చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి జయరాం జయలలిత మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విద్యా విధానాన్ని మరో పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో అమలు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించిన అంశంపై ఆమె పై విధంగా సభకు సమాధానం ఇచ్చారు.

దీనిపై శాసనసభలో సీపీఎం సభ్యుడు ఢిల్లీబాబు అడిగిన ప్రశ్నకు జయలలిత సమాధానమిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏకీకృత విద్యా విధానాన్ని తక్షణం అమలు చేస్తామని చెప్పారు. ఏకీకృత విద్యా విధానం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటీషన్‌ను కొట్టి వేసి, మరో పది రోజుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశిస్తూ తీర్పు వెలువరించిందన్నారు. ఈ విషయంలో తాను గతంలో చెప్పినట్టుగా కోర్టు ఆదేశానుసారం ఈ విధానాన్ని అమలు చేస్తామని సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి