కర్ణాటక చీఫ్ జస్టీస్‌కు పదోన్నతికి కేంద్రం నిరాకరణ!

శనివారం, 5 డిశెంబరు 2009 (12:37 IST)
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినకరన్‌కు పదోన్నతి ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. మిగిలిన వారికి పదోన్నతులు కల్పించేందుకు అనుమతి ఇచ్చింది. భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్‌కు పదోన్నతి కల్పిస్తూ.. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించేలా సుప్రీంకోర్టు కమిటీ కోరింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా, అన్ని ప్రధాన పార్టీలు ఈ చర్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కమిటీ పంపిన నివేదికను కేంద్రం తోసిపుచ్చింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్‌కు పదోన్నతి కల్పించలేమని పేర్కొంది.

అయితే, ఆ జాబితాలో ఉన్న మిగిలిన న్యాయమూర్తులకు మాత్రం పదోన్నతి కల్పించింది. ఇదిలావుండగా, కర్ణాటక చీఫ్ జస్టీస్‌గా ఉన్న దినకరన్‌ నేతృత్వంలో జరిగే కేసుల విచారణను కూడా స్థానిక న్యాయవాదులు బహిష్కరించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి