కాంగ్రెస్‌పై విరుచుకు పడిన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ!

బుధవారం, 8 ఫిబ్రవరి 2012 (05:36 IST)
File
FILE
కాంగ్రెస్ పార్టీపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ సెగ్మెంట్‌లలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం జరుగనున్న తరుణంలో నరేంద్ర మోడీ తన విమర్శలకు పదును పెంచడం గమనార్హం.

దేశంలో అత్యంత శక్తిమంతులైన నేతలుగా పేరుగాంచిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలా అని ప్రశ్నించారు. దేశ ప్రధానమంత్రి ఇంటికి కూడా కరెంట్ కోత ఉన్న తరుణంలో తాము సంవత్సరం పొడవునా 18 వేల గ్రామాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

అలాగే, అమేథీ, రాయ్‌బరేలీలకు 24 గంటల పాటు విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయగలదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వెంపర్లాడుతుంటే తాము ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి