కాశ్మీర్ పరిస్థితి దారుణంగా ఉంది: హోం మంత్రి పి. చిదంబరం

FILE
జమ్మూ-కాశ్మీర్‌లో అల్లర్లు కొనసాగుతుండటంతో, ఆ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందనే మాట నిజమేనని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అంగీకరించారు. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి హామీ ఇచ్చారు.

పార్లమెంట్‌లో విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నకు పి. చిదంబరం సమాధానమిచ్చారు. జమ్మూ-కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ప్రస్తుతం న్యూఢిల్లీ ఉన్నారని హోం మంత్రి చెప్పారు.

గత కొద్ది వారాలుగా ఒమర్‌తో పరిస్థితి అదుపు చేయడానికి తగిన చర్యలపై చర్చలు జరుపుతున్నట్లు పీసీ తెలిపారు. అలాగే ఒమర్‌తో జమ్మూకాశ్మీర్ అల్లర్ల అదుపుకు సత్వర చర్యలు తీసుకునేందుకు చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. అంతకుముందు కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ ఎల్.కే. అద్వానీ ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి