గుజరాత్ ఎన్‌కౌంటర్లపై పర్యవేక్షణ కమిటీ : సుప్రీంకోర్టు

శనివారం, 3 మార్చి 2012 (09:57 IST)
File
FILE
గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధ్యతలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ హెచ్.ఎస్.బేడీకి అప్పగించింది. గుజరాత్‌లో 2002 నుంచి 2006 వరకు జరిగిన 22 ఎన్‌కౌంటర్లపై జరిగే విచారణను ఆయన పర్యవేక్షిస్తారు.

దీనిపై మూడు నెలల్లో మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ తాజాగా జారీచేశారు. గతంలో తనను సంప్రదించకుండానే కమిటీ చైర్మన్‌గా జస్టిస్ వ్యాస్‌ను గుజరాత్ ప్రభుత్వం నియమించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి