ఘనంగా శశిథరూర్-సునంద పుష్కర్‌‍ల వివాహం!

FILE
కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ వివాహం వైభవంగా జరిగింది. కేరళలోని పాలక్కాడ్‌లో తన స్నేహితురాలు సునంద పుష్కర్‌ను శశిధరూర్ పెళ్లాడారు. ధరూర్ పూర్వీకుల నివాసంలో జరిగిన ఈ పెళ్లికి శశిథరూర్-సునంద పుష్కర్ సన్నిహితులు, బంధువులు, స్నేహితులు తదితరులు హాజరయ్యారు.

లేటు వయస్సులో ఘాటుగా ప్రేమించుకున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్, ఆయన ప్రియురాలు సునంద పుష్కర్‌ల వివాహం వారి కుమారుల సమక్షంలో ఆదివారం ఘనంగా జరిగింది.
FILE


వివాహానంతరం తిరువనంతపురానికి చేరుకునే ఈ దంపతులు 23వ తేదీన బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు తిరువనంతపురంలో విందు ఇస్తారు. ఆ తర్వాత ఆగస్టు 29వ తేదీన దుబాయ్‌లో సెప్టెంబరు మూడో తేదీన ఢిల్లీలో రిసెప్షన్లు ఏర్పాటు చేస్తారని శశిథరూర్ కుటుంబీకులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి