చంద్రయాన్-2 కోసం రూ.426 కోట్లు ఖర్చు: ఇస్రో

చంద్రయాన్-2 ప్రయోగం కోసం 426 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వెల్లడించింది. చంద్రయాన్‌-1 కంటే ఈ ప్రయోగానికి రూ.40 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నామని ప్రాజెక్టు డైరెక్టర్‌ మైల్‌స్వామి అన్నాదురై తెలిపారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ చంద్రయాన్‌-1 కేవలం చంద్రుని కక్ష్యలో తిరుగుతూ పని చేసిందని, అయితే చంద్రయాన్‌-2 ప్రయోగంలో మానవ రహితమైన ఉపగ్రహం చంద్రునిపై దిగుతుందని ఆయన వివరించారు.

ఈ ప్రయోగాన్ని 2013 సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశముందన్నారు. 2008 అక్టోబర్‌లో ప్రయోగించిన చంద్రయాన్‌-1, తర్వాతి ఏడాది ఆగస్టు 30వ తేదీన ఇస్రోతో సంబంధాల పునరుద్ధరణలో విఫలమైన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి