చైనా నౌకా దళం పెద్దది మాత్రమే: సురేష్

చైనా నావికా దళం మన కంటే పెద్దది మాత్రమేనని, మెరుగైంది కాదని భారత నావికా దళ చీఫ్ సురేష్ మెహతా అభిప్రాయపడ్డారు. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా బుధవారం మాట్లాడుతూ.. భారత్ కంటే చైనా నావికా దళం ఎంతో పెద్దదని చెప్పారు. అయితే మెరుగైన దళమైతే మాత్రం కాదని పేర్కొన్నారు.

చైనా విషయంలో తాను ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ సమర్థిస్తున్నానని మెహతా తెలిపారు. చైనా నేవీ మనకంటే చాలా పెద్దదని గతంలో చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. అయితే పెద్దదైనంత మాత్రాన అది మెరుగైంది కావాలనేంలేదని తాజాగా సురేష్ మెహతా వ్యాఖ్యానించారు. బుధవారం ఐఎన్ఎస్ తబర్ బోర్డుపై మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.

వాళ్ల దగ్గర 10 నౌకలున్నాయి.. మనదగ్గర 10 నౌకలున్నాయనుకుంటూ మాట్లాడుకోవడం కాదు. ఇతరుల నౌకల కంటే మెరుగ్గా పని చేయగల నౌకలు ఉన్నాయా లేదా అనేదే ముఖ్యమన్నారు. అందువలనే సంఖ్యాపరంగా కాకుండా సాంకేతిక పరంగా నౌవీని అభివృద్ధి చేయాలని తాను గతంలో వ్యాఖ్యానించానని మెహతా తెలిపారు.

భారత్‌కు పాకిస్థాన్‌లోని తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచివుందని, ఆ సంస్థలు భారత్‌పై మళ్లీ దాడులకు వ్యూహరచన చేస్తున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై సురేష్ మెహతా మాట్లాడుతూ.. దేశ తీర ప్రాంతం.. దుర్బేధ్యంగా లేదన్నారు. తీరప్రాంత భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని మెహతా వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి