జమ్ము- కాశ్మీర్‌లో చొరబాట్లు పెరిగాయి: ఆర్మీ

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి పాకిస్థాన్ నుంచి తీవ్రవాద చొరబాట్లు పెరిగాయని ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ శుక్రవారం తెలిపారు. సరిహద్దు చొరబాట్లు రాష్ట్రంలో చొరబాట్లు ఇటీవల పెరుగుతూ వస్తున్నాయని చెప్పారు. శీతాకాలంలోగా సాధ్యమైనంత ఎక్కువ మంది తీవ్రవాదులను భారత్‌లోకి ప్రవేశించేలా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల సరిహద్దు చొరబాటు యత్నాలు పెరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని దీపక్ కపూర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శుక్రవారం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. రెయాసి జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన ఓ కీలక కమాండర్ హతమయ్యాడు. కాశ్మీర్‌లో లోయలో శాంతికి భగం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీపక్ కపూర్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి