తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉద్రిక్తత: వైగో అరెస్టు..!

FILE
ఎండీఎంకే నేత వైగోను ఉడుమలై పేట వద్ద శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పంబా నదిపై కేరళ ప్రభుత్వం నిర్మించే ఆనకట్టను పర్యవేక్షించేందుకు వెళ్లిన వైగోను మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కేరళ సరిహద్దులోకి ప్రవేశించిన వైగోతో పాటు పార్లమెంట్ సభ్యులు గణేష్ మూర్తిలతో కూడిన వందమందిని పోలీసులు అరెస్టు చేశారు.

పంబా నదిపై ఆనకట్ట నిర్మించేందుకుగాను కేరళ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఎండీఎంకే నేత వైగో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నిర్మించే నూతన ఆనకట్టను పర్యవేక్షించేందుకుగాను శుక్రవారం వైగో ప్రయాణమయ్యారు. కానీ కేరళ సరిహద్దు ప్రాంతం, చెక్ పోస్టు వద్ద పోలీసులు వైగోను అధుపులోకి తీసుకున్నారు.

దీంతో పోలీసులతో వైగో వాగ్వివాదానికి దిగారు. పోలీసులకు నిరసిస్తూ ఎండీఎంకే నేతలు ధర్నా చేపట్టారు. ఇంతేగాకుండా ఎండీఎంకే కార్యకర్తలు పోలీసుల చర్యలను లెక్కచేయకుండా కేరళ సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వైగో, గణేష్‌మూర్తిలతో పాటు ఎండీఎంకే నేతలు వందమంది ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

వెబ్దునియా పై చదవండి