తెలంగాణ తర్వాత బెంగాల్‌ను విభజిస్తారేమో? : మమతా!

సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (18:28 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలవంతంగా విభజిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమ వద్దకు వస్తారేమోననే సందేహాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకుని తీరుతామని ఆమె ప్రకటించారు.

తాము సమైక్య భారతానికి కట్టుబడి ఉన్నామని, తాము పార్లెమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రేన్ చెప్పారు. ఇదిలావుండగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం కోల్‌కతాకు చేరుకుని మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. ఆయన తెలంగాణపైనే కాకుండా ఇతర రాజకీయ విషయాలపై కూడా మమతా బెనర్జీతో మాట్లాడినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి