త్రివిధ దళాలను ఆధునీకరిస్తాం : ప్రధాని

సోమవారం, 10 డిశెంబరు 2007 (15:16 IST)
త్రివిధ దళాల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. డెహ్రడూన్‌లోని భారత మిలటరీ అకాడమీ (ఐఎమ్ఏ) ఆవరణలో 600 మంది క్యాడెట్లను ఉద్దేశించి మన్మోహన్ సింగ్ సోమవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల ఆధునీకరణ నిమిత్తం ఎంతటి ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడబోదని ప్రధాని స్పష్టం చేశారు.

తగురీతిలో ఖర్చుపెట్టే నిర్వహణ సామర్ధ్యాన్ని మెరుగుపరిచుకోవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. అకాడమీ సోమవారం ప్లాటినం జూబ్లీ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా క్యాడెట్ల పాసింగ్ అవుట్ పారెడ్‌ను ప్రధాని సమీక్షించారు. గడచిన 25 సంవత్సరాలలో క్యాడెట్ల పాసింగ్ అవుట్ పారెడ్‌ను సమీక్షించిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రత్యేకతను సంతరించుకున్నారు. గతంలో దివంగత ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు సమీక్షించారు.

వెబ్దునియా పై చదవండి