దేశంలో వాణిజ్య కోర్టుల ఏర్పాటుకు యోచన: కపాడియా

దేశంలో నానాటికీ పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్.కపాడియా తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మన దేశంలో కోర్టు వెలుపల వివాదాలు పరిష్కారం చేసుకునే సంస్కతి లేకపోవడమే పెండింగ్ కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోందన్నారు.

పలు దేశాల్లో మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం చాలా వరకు విజయవంతమైందన్నారు. కేసుల సత్వర పరిష్కారంతో పాటు.. సమయం కూడా చాలా ఆదా అవుతుందన్నారు. ఇదే తరహా కోర్టులను దేశంలో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు ఆయన తెలిపారు.

ఎందుకంటే.. కోర్టుకెక్కేవారు మధ్యవర్తి సహకారంతో కోర్టు వెలుపలే తమ సమస్యలను పరిష్కరించుకునే పద్దతిని ఆచరణలోకి తీసుకుని రావాలని ఆయన సూచించారు. వివాద పరిష్కారం కోసం కేవలం కోర్టులపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి