నరేంద్ర మోడీ.. దేశం కోసం ఫ్యామిలీని త్యజించారు: బ్రదర్

File
FILE
తన సోదరుడి వివాహ స్థితిపై చెలరేగుతున్న వివాదానికి తెర దించేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి సోదరుడు సోమాబాయ్ మోడీ రంగంలోకి దిగారు. 50 ఏళ్ల క్రితం జరిగిన మోడీ వివాహాన్ని సామాజిక లాంఛనంగానే చూడాలని ఆయన అన్నారు. వడోదర లోక్‌సభ స్థానానికి వేసిన నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో మోడీ తొలిసారి తన భార్య జశోదాబిన్ పేరును ప్రస్తావించారు.

శాసనసభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో మాత్రం ఆయన భార్య కాలమ్‌ను ఖాళీగా ఉంచుతూ వచ్చారు. తమ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదని, తమది పేద కుటుంబమని, తమ తల్లిదండ్రులకు మోడీ మిగతా పిల్లలాంటివారేనని, తమ తల్లిదండ్రులు మోడీకి ఎప్పుడో పెళ్లి చేశారని, అది సామాజికపరమైన లాంఛనంగా మాత్రమే చేశారని ఆయన వివరణ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి