వృద్ధురాలు ఇద్దరు పిల్లలతో కలిసి నివాస ప్రాంతంలోని నిశ్శబ్ద రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా, స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది.
అయితే, వెంటనే వృద్ధురాలి మనవరాలు తన వద్ద ఉన్న బ్యాగ్‌తో దొంగపై దాడి చేసింది. ఈ సంఘటన ఫిబ్రవరి 25న జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 9న పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేశారు.
నాన్నమ్మను కాపాడేందుకు నేరస్తుడితో బాలిక ధైర్యంతో పోరాడిందని పోలీసులు, నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేరానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చిన్నపిల్లలు కూడా మార్పు తీసుకురాగలరని ఈ సంఘటన గుర్తుచేస్తుంది.