పదో తరగతిలో గ్రేడింగ్ విధానానికి గ్రీన్ సిగ్నల్

పదో తరగితిలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ సోమవారం ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని పదోతరగతితోపాటు సీబీఎస్ఈలో అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

కేవలం ఒక్క పరీక్ష ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కవేయక సంవత్సరం మొత్తమ్మీద వారి ప్రతిభను ఆధారం చేసుకుని ఈ గ్రేడింగ్ ఉంటుందన్నారు. కాగా ఈ విధానానికి సీఎబీఇ మద్దతు తెలిపిందని సిబాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

టెన్త్ పరీక్షలలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు కోరిన మీదట తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి