పెట్రోపై 7.5% ఎక్సైజ్ డ్యూటి: నిత్యావసరాలకు "గుదిబండ"

ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆహార పదార్థాల ధరల అదుపునకు బదులు మరింత పెరిగే విధంగా నిర్ణయాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆహార పదార్థాల ధరల అదుపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామంటూనే పెట్రోల్‌పై 5 శాతం, డీజిల్‌పై 7.5 శాతం మేర ఎక్సైజ్ డ్యూటీ పెంచడమే దీనికి నిదర్శనమంటున్నారు.

పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో ఆహారపదార్థాల ధరలు అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతాయని విశ్లేషకులు అంటున్నారు. ధరల అదుపుకు కట్టుదిట్టమైన ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ వెల్లడించినా ఆ ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.

సామాన్య మానవుడిని ఆదుకుంటామంటూనే వారి నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శిస్తున్నారు. వ్యవసాయం విషయానికి వస్తే... ఆధ్రప్రదేశ్ వరద బీభత్సంతో అతలాకుతలమైన నేపధ్యంలో వ్యవసాయ రుణాలమాఫీ ఉంటుందని అంచనా వేశారు. కానీ కేవలం ఆరు నెలలపాటు రుణాలు రీషెడ్యూల్‌కు మాత్రమే అవకాశమిచ్చారు. మొత్తమ్మీద కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రైతులకు మొండి చేయి చూపించిందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి