ప్రధానమంత్రిపై విశ్వాసం పోయింది : అన్నా హజారే వ్యాఖ్యలు

శుక్రవారం, 1 జూన్ 2012 (14:58 IST)
File
FILE
దేశంలో అవినీతి నిర్మూలనకు కేంద్రంలోని యూపీఏ సర్కారు చేపట్టిన చర్యలు పట్ల అవినీతి ఉద్యమకారుడు అన్నా హజారే నిరాసక్తతను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిగా లేవని అందువల్ల ప్రధానమంత్రిపై తనకు విశ్వాసం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌‍ పట్ల ఎంతో నమ్మకం ఉండేదన్నారు. కానీ ఇపుడు ఆయన పట్ల విశ్వాసం పూర్తిగా సన్నిగిల్లి పోయిందన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో మంచి వారిని ఎంచుకుని వారిని పార్లమెంట్‌కు పంపించాలన్నారు. అపుడే వారి నుంచి కొంత మార్పును ఎదురు చూడాలన్నారు. గత 65 యేళ్ల కాలంలో ప్రజా ప్రయోజనార్ధం ఒక్క బిల్లును కూడా లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించలేదని ఆయన వాపోయారు. పెక్కుమంది నేతలు అవినీతి అరోపణల్లో చిక్కుకుంటున్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి