ప్రధాని పదవికి పూర్తి సామర్థ్యం ఉన్న నేత మోడీ : గడ్కారీ

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (03:00 IST)
File
FILE
దేశ ప్రధానమంత్రి పీఠానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పూర్తి సామర్థ్యం ఉన్న నేతగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని పీఠానికి పోటీ పడుతున్న ఐదుగురు ప్రధాన నేతల్లో నరేంద్రమోడీ ఒకరని ఆయన చెప్పారు.

వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మంచి శక్తిసామర్థ్యాలు కలిగిన నేత దేశ ప్రధానమంత్రి పదవికి అర్హులని గడ్కారీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెల్సిందే. ఈ పదవికి భాజపా నుంచి పోటీ పడుతున్న వారిలో నరేంద్ర మోడీ ఒకరన్నారు. ఈయనకు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయన్నారు.

ప్రస్తుతం ఆ పదవి రేసులో ఐదు నుంచి ఆరుగురు నేతలు ఉన్నారని, సరైన సమయంలో ఒకరి పేరును అధిష్టానం ఎంపిక చేస్తుందని ఆయన తెలిపారు. తాను పేర్కొంటున్న ఐదారుగురు నేతల్లో నరేంద్ర మోడీ కూడా ఒకరని ఆయన చెప్పారు.

కాగా, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రేసులో ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీతో సహా మరికొందరు రేసులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి