ప్రభాకరన్ తల్లి వైద్యచికిత్సకు అనుమతి: కరుణానిధి

సోమవారం, 10 మే 2010 (16:12 IST)
కొన్ని నిబంధనలతో వైద్య పరీక్షల కోసం దివంగత ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ తల్లి పార్వతి అమ్మాళ్ తమిళనాడు రాష్ట్రానికి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి వెల్లడించారు. ఈ విషయాన్ని కౌలాలంపూర్‌లో ఉంటున్న ఆమెకు లేక ద్వారా తెలియజేసినట్టు ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రకటనను తనకు తానుగా చేశారు.

80 సంవత్సరాల వృద్ధారులైన పార్వతి అమ్మాళ్ కేవలం వైద్య పరీక్షల కోసమే చెన్నయ్‌కు వచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాగా, గత నెలలో చెన్నయ్‌కు వచ్చిన ఆమెను మలేషియా రాజధాని కౌలాలంపూరుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు పంపించి వేసిన విషయం తెల్సిందే.

ఆమె కోరుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తామని ముఖ్యమంత్రి కరుణానిధి వెల్లడించారు. అలాగే, చెన్నయ్‌కు వచ్చే ఆమె ఆస్పత్రిలో మినహా మరో చోట నివశించబోదని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి