ప్రభుత్వ శక్తి కంటే .. ప్రజల శక్తే గొప్పది: అన్నా హజారే

శుక్రవారం, 5 ఆగస్టు 2011 (10:49 IST)
ప్రభుత్వ శక్తి కంటే.. ప్రజల శక్తే గొప్పదని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే అన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు విషయంలో యూపీఏ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజల అభీష్టం మేరకు జన్ లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయాలన్నారు.

ప్రభుత్వ శక్తి కంటే ప్రజల శక్తే గొప్పదని హజారే అన్నారు. తాము అనుకున్నట్టుగానే ఈనెల 16వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేస్తామన్నారు. గతంలో తాను చేపట్టిన నిరాహారదీక్షను మరోమూడు రోజులు పాటు కొనసాగించి ఉంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోయి ఉండేదన్నారు. అదేసమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు.

ఈ దేశం నుంచి అవినీతి జాఢ్యాన్ని పారద్రోలేందుకే తాను ఈ దీక్ష చేపట్టినట్టు ప్రకటించారు. అవినీతిని తుదముట్టించడంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి చేపట్టే దీక్షను జంతర్ మంతర్ వద్ద కాకుంటే మరోచోట నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి