ప్రేమోన్మాది ఘాతుకం... పిలిచిన వెంటనే రానన్నందుకు కాల్చి చంపేశాడు

శుక్రవారం, 10 మే 2013 (15:12 IST)
WD
ఢిల్లీలో మరో ప్రేమోన్మాది ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల అమ్మాయిని పొట్టనబెట్టుకున్నాడు. శుక్రవారంనాడు ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో నివశిస్తున్న విద్యార్థిని ఇంటికి బైకుపై వచ్చి ఆమెను తన బైకుపై ఎక్కాల్సిందిగా కోరాడు.

దానికి ఆమె ససేమిరా అనేసరికి వెంట తెచ్చుకున్న పిస్టల్‌తో కాల్చాడు. ఈ హఠత్పారిణామంతో అక్కడివారు భీతిల్లిపోయారు. విద్యార్థిని తల్లితో సహా అక్కడివారు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు బైకుపై పారిపోయాడు. బాధితురాల్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె మరణించింది.

కాగా గత కొన్నేళ్లుగా తమ కుమార్తెను ఈ ఆకతాయి పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పారు. తమ కూతురిపై అతడు అఘాయిత్యం చేస్తాడేమోనని గతంలో ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి