బాన్ కీ మూన్‌కు మద్దతు ప్రకటించిన భారత్

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న ప్రస్తుత చీఫ్ బాన్ కీ మూన్‌కు భారత్ మద్దతు ప్రకటించింది. 2007లో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బాన్ కీ మూన్ పదవీకాలం డిసెంబరు 31వ తేదీతో ముగియనుంది.

ఈ నేపథ్యంలో 2012-16 సంవత్సరానికి గాను ఐదేళ్ళపాటు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించేందుకు ఆయన పోటీ పడనున్నారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య దేశాలకు ఆయన లేఖ కూడా రాశారు.

దీంతో బాన్ కీ మూన్‌కు భారత్ మద్దతు ప్రకటించింది. కాగా, ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఇప్పటి వరకు మూన్ మినహా ఇతరులెవ్వరూ పోటీ పడక పోవడం గమనార్హం. దీంతో ఆయన రెండో సారి ఎన్నిక కావడం ఖాయమని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి