బూటాసింగ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

శనివారం, 1 ఆగస్టు 2009 (12:13 IST)
ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బూటాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కుమారుడు చేసిన నిర్వాకంతో కేంద్ర నేర పరిశోధా సంస్థ (సీబీఐ) బూటాసింగ్‌ను విచారించాలని నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం సీబీఐ అధికారులు బూటాసింగ్‌ను శనివారం కలుసుకునే అవకాశం ఉంది.

నాసిక్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్‌పై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును ఎస్సీఎస్టీ జాతీయ కమిషన్ విచారణ జరుపుతోంది. అందువల్ల తన తండ్రి సహకారంతో కేసు ఎత్తివేసేందుకు బూటా కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్ కాంట్రాక్టర్‌ను కోటి రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సరబ్‌జ్యోత్‌ సింగ్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ వ్యవరహారంలో బూటాసింగ్‌ వద్ద కూడా విచారణ జరపాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

గత 12 రోజులుగా పలువురు హవాలా ఆపరేటర్లతో సరబ్‌జ్యోత్ మాట్లాడిన టెలిఫోన్ సంభాషణలు జరిపారన్నది సమాచారం. నాసిక్‌కు చెందిన కాంట్రాకర్ రామారావు పాటిల్ ఏసీబీ (సీబీఐ)కి చేసిన ఫిర్యాదుతో ఈ బండారం బయటపడింది. సరబ్‌జ్యోత్ సింగ్ తన నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు.

దీంతో గురువారం బాటా తనయుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం అధికారికంగా అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో బూటాకు కూడా సంబంధాలు ఉండే అవకాశం ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది.

వెబ్దునియా పై చదవండి