బూటా కుమారుడికి 12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

బుధవారం, 5 ఆగస్టు 2009 (19:40 IST)
లంచం కేసులో సీబీఐ అధికారులకు చిక్కిన కేంద్ర మాజీ మంత్రి బూటా సింగ్ కుమారుడు సరబ్‌జ్యోత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 12వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. అలాగే, విచారణ నిమిత్తం సరబ్‌జ్యోత్‌ కస్టడీని పొడగించాలన్న ఏసీబీ అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

అదే సమయంలో సరబ్‌జ్యోత్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది. నిందితుల కస్టడీ పొడిగించాలని సీబీఐ చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తున్నాను. దర్యాప్తు చేసేందుకు ఏజెన్సీకి తగినంత సమయం ఇవ్వడం జరిగింది. ఇక వారిపై కస్టోడియల్‌ దర్యాప్తు అవసరం లేదని భావిస్తున్నాను అని న్యాయమూర్తి ఎస్‌పి.హయత్‌ నగార్కర్‌ అభిప్రాయపడ్డారు.

నాసిక్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్‌పై నమోదైన ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసును ఎత్తివేయించేందుకు బూటా సింగ్ కుమారుడైన సరబ్‌జ్యోత్ సింగ్ కోటి రూపాయలు లంచం పుచ్చుకుంటూ ఏసీబీ (సీబీఐ) అధికారులకు చిక్కాడు. కాగా, బూటా సింగ్ ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి