భారత్‌కు జాతిపిత మహాత్మా గాంధీ ఆగమనం ఎలా జరిగింది?

FILE
భారత్‌కు జాతిపిత మహాత్మా గాంధీ ఆగమనం ఎలా జరిగిందంటే.. మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. భారత దేశంలో నిరంకుశమైన రౌలట్ చట్టం, కూలీల పట్ల వివక్షనూ వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించారు.

ఈ ఆందోళనల సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు. దీనికి స్ఫూర్తి పంజాబ్ ప్రాంతంలో 1872లో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం. ఈ ఉద్యమాలు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాలో జాన్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంకుశ చట్టాలను అధికారికంగా వెనక్కు తీసుకుంది.

ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగివచ్చిన గాంధీకి ఇక్కడి పరిస్థితులు, రాజకీయాలు కొత్త. ఆంగ్లేయులు భారతదేశానికి తీసుకువచ్చిన పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి అప్పుడు దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారంగా భావించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతయైన గోపాలక్రిష్ణ గోఖలే గాంధీకి మార్గదర్శకుడిగా మారారు.

గాంధీజీ ప్రతిపాదించిన అహింసా పూరిత సహాయ నిరాకరణ ఉద్యమం మొదట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు రుచించలేదు. అయితే సామాన్య ప్రజల్లో స్ఫూర్తి రగిల్చిన గాంధీ దూరదృష్టి ఎంతో మందిని జాతీయ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలోకి వచ్చేలా చేశారు.

ఈ ఉద్యమంలో భారతీయ వృత్తులు, పరిశ్రమలు వాటి మీద ఆధారపడి జీవితున్న ప్రజల పరిరక్షణ కూడా ఒక భాగం. ఉదాహరణకు బీహార్ లోని చంపారన్‌లోవాణిజ్య పంటలను బలవంతంగా పండించమని పేదరైతులను బలవంతం చేస్తూ, వారి నుంచి అన్యాయంగా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ వారికి ఆహార ధాన్యాలు కూడా సరిగా అందుబాటులో లేకుండా చేసే ప్రభుత్వ విధానాలపై పోరాడి విజయం సాధించారు. ఇలా ఎన్నో అహింసాయుత ఉద్యమాలే గాంధీజీని స్వాతంత్ర్య సమరంలో భారత్‌కు స్వతంత్ర్యం సాధించిపెట్టాయి. మరి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

వెబ్దునియా పై చదవండి