భారత్-అమెరికా నౌకాదళ విన్యాసాలు ప్రారంభం

మంగళవారం, 4 సెప్టెంబరు 2007 (19:02 IST)
తూర్పు నౌకాదళం పరధిలో 'మలబార్-07' పేరుతో భారత్-అమెరికా దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు కూడా పాల్గొనున్నాయి. ముఖ్యంగా భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌తో పాటు.. మరో ఏడు అత్యాధునిక యుద్ధ నౌకలు ఈ విన్యాసాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

బంగాళాఖాతంలోని అంతర్జాతీయ జలాల్లో ప్రారంభమైన ఈ నౌకాదళ విన్యాసాలను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విన్యాసాలను వ్యతిరేకిస్తూ కోల్‌కతా నుంచి విశాఖపట్నం వరకు జాత్ యాత్రను కూడా వామపక్షాలు ప్రారంభించాయి. భారత విదేశాంగ విధానానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వామపక్ష నేతలు జ్యోతిబసు, బర్థన్ తదితరులు ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి