భారత్-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మొహరింపు

FILE
పొరుగు దేశమైన చైనాకు ఆనుకుని ఉన్న వాస్తవాధీన రేఖపై ఉన్న స్థావరాలను పటిష్టపరిచేందుకు భారత సైన్యం తన దళాలను ప్రవేశపెట్టే కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ చర్య సాధారణమేనని పేర్కొంది. శీతాకాలంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో అప్రమత్తతకోసం ఈ చర్య తీసుకున్నట్టు సైన్యం పేర్కొంది.

తాము చేపట్టిన కార్యక్రమంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, వాతావరణం ప్రతికూలంగా మారేముందు సరిహద్దుల్లో ఎగువన ఉన్న ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం తాము ఇలాంటి కార్యక్రమానికి పూనుకోవడం మామూలేనని సైనిక వర్గాలు తెలిపాయి.

జమ్మూ-కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఉన్న 4,057 కిలోమీటర్ల పొడవున్న భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలకు తమ సైన్యంలోని సగభాగాన్ని పంపుతున్నట్టు వారు తెలిపారు.

జమ్మూ-కాశ్మీర్‌లో లడఖ్‌లోని చునార్‌ ప్రాంతంలో చైనా దళాలు చొరబడి మిలిటరీ హెలికాప్టర్ల ద్వారా ఆహారపు క్యాన్‌లను, పెయింట్‌ చేసిన ఉత్తరాలను జారవిడుస్తున్నాయని వార్తలు రావడంతో సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తతకోసం భారతసైన్యం ఇలాంటి కార్యక్రమానికి పూనుకుందని సైనికాధికారులు తెలిపారు.

ఇదిలావుండగా ప్రస్తుతం చైనా చొరబాట్లు అధికమతాయనే బెంగతోనే వాటిని కట్టడి చేసేందుకుగాను సైన్యం అప్రమత్తమైందని విదేశాంగమంత్రతిత్వ శాఖ తెలిపింది.

కాగా తమ దేశం భారత్‌తో చెలిమి కోరుకుంటోందని, ఎప్పటికీ మిత్రదేశంగానే వ్యవహరిస్తుందని ఇటీవల ఆ దేశ దౌత్యాధికారి భారత్‌లో వెల్లడించిన విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి