మహాత్మా గాంధీకి జాతిపిత బిరుదు కేంద్రం ఇవ్వలేదు!!

శుక్రవారం, 26 అక్టోబరు 2012 (09:06 IST)
File
FILE
భారత స్వాతంత్ర్యపోరాటయోధుడు మహాత్మా గాంధీకి జాతిపిత బిరుదును భారత ప్రభుత్వం ఇవ్వలేదనే కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు చెందిన ఆరో తరగతి బాలిక ఐశ్వర్యా పరాశర్ రాష్ట్రపతికి సమాచార హక్కు చట్టం ద్వారా దాఖలు చేసిన పిటీషన్‌పై కేంద్రం హోంశాఖ పై విధంగా స్పందించింది.

భారత రాజ్యాంగం ప్రకారం మహాత్మాగాంధీ జాతిపిత కాదని, భారత రాజ్యాంగం ప్రకారం విద్యా, సైనిక పరమైన అంశాలకు తప్ప మరే ఇతర అంశాలకు సంబంధించి బిరుదులను ఇచ్చే అధికారం భారత ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని 18(1) నిబంధన విద్యా, సైనిక విషయాల్లో తప్ప ఇతర ఏ అంశాల్లో ప్రత్యేక బిరుదులు ఇచ్చేందుకు అనుమతించదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి