మహాత్మా గాంధీ 65వ వర్థంతి : ఎపుడు.. ఎక్కడ చనిపోయారు?

బుధవారం, 30 జనవరి 2013 (10:09 IST)
File
FILE
జాతిపిత మహాత్మా గాంధీ 65వ వర్థంతి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, స్పీకర్ మీరా కుమార్‌లు ఢిల్లీలోని మహాత్మా సమాధి శాంతివనంకు నివాళులు అర్పించారు.

అలాగే, హైదరాబాద్‌లో లంగర్‌హౌజ్‌లోని బాపూజీ ఘాట్‌కు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఇదిలావుండగా, 1948 జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ హత్యకు గురైన విషయం తెల్సిందే.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నబంర్ 5, తీస్ జనవరి మార్గ్‌‌లో ఏరియాలోని ఓ అవెన్యూలో ఉన్న నివాసంలో ఆయన 144 రోజుల పాటు ఉంటూ వచ్చారు. ఇదే ఇంటిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. జాతిపితగా పిలుచుకునే గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకుని నేటికి 65 యేళ్లు. ఈ సందర్భంగా గాంధీ వర్థంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి