మహిళలకు 50శాతం కోటాపై నిర్ణయం వాయిదా

FILE
స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం కోటా అమలుచేసే విషయంపై తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేంద్ర క్యాబినేట్ వాయిదా వేసింది. గురువార క్యాబినేట్ సమావేశం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగింది.

ప్రధాని వద్దనున్న అజెండాలో ఈ అంశం ఉన్నా చర్చకు నోచుకోలేదు. వచ్చేవారం జరిగే క్యాబినేట్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి.

వీటిని 50శాతానికి పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు గురువారం క్యాబినేట్ ముందుకు వచ్చినా వాయిదా పడింది.

ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖామంత్రి సీపీ జోషీ గైర్హాజరు కారణంగానే ఈ అంశం వాయిదా పడినట్లు సమాచార, ప్రసారశాఖల మంత్రి అంబికాసోనీ క్యాబినేట్ సమావేశానంతరం విలేకరులకు తెలిపారు

వెబ్దునియా పై చదవండి