రమేష్.! ఏమిటా మాటలు...?: ప్రధాని మందలింపు

చైనా కంపెనీల పట్ల భారత వైఖరి డోలాయమానంగా ఉన్నదనీ కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన అంశాల విషయంలో రమేష్ చేసిన వ్యాఖ్యలపై అటు ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతాపార్టీ సైతం మండిపడింది. రమేష్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తక్షణం తొలగించాలని డిమాండ్ చేసింది.

రెండు రోజుల క్రితం భారత్‌లో చైనా కంపెనీలకు సంబంధించి జైరామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మన్మోహన్ ఆయనను సున్నితంగా మందలించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... మంత్రివర్గంలోని సభ్యులందరూ తమతమ శాఖలకు సంబంధించి కాక ఇతర మంత్రుల శాఖల గురించి మాట్లాడకపోవడం మంచిదని అన్నారు. ముఖ్యంగా చైనా వంటి పొరుగు దేశాలకు సంబంధించిన విషయాలపై మరింత ఆచితూచి స్పందించాల్సి ఉంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి