రాజ్యసభలో మూడు రాష్ట్రాలపై ప్రైవేటు బిల్లులు: భాజపా!

శుక్రవారం, 4 మార్చి 2011 (13:50 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణా సెంటిమెంట్‌ను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు గాను రాజ్యసభలో ప్రైవేటు బిల్లును పెట్టేందుకు సమాయత్తమవుతోంది.

తెలంగాణాతోపాటు లడఖ్, గూర్ఖాల్యాండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో శుక్రవారంనాడు ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టనుంది.

దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను యూపీఎ ప్రభుత్వం ఓ సాకుగా చూపెట్టడాన్ని భాజపా తోసిపుచ్చింది. పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు ఎన్నికల కోడ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించదని తేల్చి చెప్పింది.

ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తన మొండివైఖరిని విడనాడి తెలంగాణా ప్రజల ఆకాంక్ష మేరకు పార్లమెంటులో బిల్లును పెట్టాలని మరోసారి సూచించింది.

వెబ్దునియా పై చదవండి