లోక్పాల్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలి: అభిషేక్

శనివారం, 10 డిశెంబరు 2011 (09:50 IST)
లోక్పాల్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలని సిఫార్సు చేస్తున్నట్టు పార్లమెంట్ స్థాయీ సంఘం ఛైర్మన్ అభిషేక్ సింఘ్వీ తెలిపారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రూపొందించిన లోక్పాల్ బిల్లు నివేదికను శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సింఘ్వీ మాట్లాడుతూ.. రాజ్యసభలో లోక్‌పాల్ తుది నివేదికను సమర్పించామని, దీనికి రాజ్యాంగ హోదా కల్పించాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు.

రాజ్యాంగ హోదా కల్పించడం వల్ల జాప్యం జరుగుతుందన్న భయాలు సరికాదని, ఒక్కరోజులోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ హోదా కోసం ప్రతిపాదిత సవరణ బిల్లులో ఏడు పారాగ్రాఫ్‌లకు మించి ఉండదని సింఘ్వీ తెలిపారు.

సీబీఐను లోక్‌పాల్‌లోకి తేవాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. సీబీఐ లోక్‌పాల్‌కుగానీ, ప్రభుత్వానికిగానీ జవాబుదారీగా ఉండదని పేర్కొన్నారు. లోక్‌పాల్, సీబీఐ, సీవీసీ మధ్య సమతౌల్యం ఉండేలా నివేదిక రూపొందించామన్నారు.

వెబ్దునియా పై చదవండి