వరద ప్రాంత బాధితులకు అమెరికా సాయం: తిమోతి

భారతదేశంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం లక్షడాలర్ల సహాయాన్ని ప్రకటించింది.

భారతదేశంలో సంభవించిన వరదల కారణంగా ప్రాణనష్టం కలిగి భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. దీనికి తమ వంతు సహాయంగా అమెరికా దేశం లక్ష డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు సమ్మతించిందని భారతదేశంలోని అమెరికా రాయబారి తిమోతి జే రోమర్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం దేశంలోని వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజల స్థితిగతులు హృదయ విదారకంగా ఉన్నాయని, చాలామంది నిలువ నీడ లేక అల్లలాడుతున్నారని, లక్షల సంఖ్యలో నిరాశ్రులైనారని అన్నారు.

వీరిని మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు గాను లక్ష డాలర్లను సహాయంగా ఇచ్చేందుకు నిర్ణయించినట్లు అమెరికా నిర్ణయించిందని, ఈ మొత్తం సొమ్మును వెంటనే భారతదేశ ప్రధానికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి