విమర్శలతో వెనక్కి తగ్గిన ఇస్రో: దేవాస్‌తో ఒప్పందం రద్దు!

మరో స్పెక్ట్రమ్ కుంభకోణం అంటూ మీడియాలో వచ్చిన వార్తలపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వెనక్కి తగ్గింది. దేవాస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ వెల్లడిచారు.

దీనిపై ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ దేవాస్ సంస్థకు ఇప్పటివరకు స్పెక్ట్రం ఇవ్వలేదని తెలిపారు. ఉపగ్రహ ట్రాన్స్‌పాండర్లను కూడా అందజేయలేదన్నారు. కేటాయింపే జరగనపుడు ప్రభుత్వానికి ఎలా నష్టం జరుగుతుందని ఆయన ప్రశ్నిచారు. రెండు ఉపగ్రహాల ట్రాన్స్‌పాండర్లలో 90 శాతాన్ని దేవాస్ సంస్థ ఉపయోగించుకునేలా కుదుర్చుకున్న ఒప్పందం సమాచారాన్ని కేంద్ర మంత్రివర్గంతో కానీ, స్పేస్ కమిషన్‌తో కానీ పంచుకోలేదన్నారు.

ఇస్రో మాజీ ఛైర్మన్, ప్రణాళిక సంఘం సభ్యుడు కె.కస్తూరిరంగన్‌తో కలిసి రాధాకృష్ణన్ మంగళవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఎస్‌బ్యాండ్ కొత్త సర్వీసు కావడంతో బిడ్‌లను ఆహ్వానించలేదన్నారు. ప్రధానంగా కేటాయింపులే జరగనపుడు ఆర్థికంగా ఎలా నష్టం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి