వెబ్‌సైట్‌లో అవినీతి అధికారుల పేర్లు : సివిసి

FILE
కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ దేశ చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 123 మంది అవినీతిపరులైన ప్రభుత్వాధికారుల పేర్లను ప్రకటించింది. అవినీతి ఆరోపణలున్న వీరిని విచారించి జరిమానా విధించాలని సివిసి కేంద్రప్రభుత్వానికి సూచించింది.

గతంలో కమిషన్‌ అధికారుల శాఖలను పేర్కొంటూ అవినీతిపరుల సంఖ్య మాత్రమే ప్రకటించింది. ఇప్పుడు తొలిసారిగా సివిసి తన వెబ్‌సైట్‌లో వారి పేర్లను కూడా వెల్లడించడం గమనార్హం.

సివిసి ప్రకటించిన జాబితాననుసరించి 101 మంది అధికారుల పేర్లను పేర్కొంది. వారికి భారీగా జరిమానాలు విధించాలని కూడా సూచించింది. సివిసి తన జాబితాలో పేర్కొన్న అవినీతి అధికారుల్లో 17 మంది జాతీయ బ్యాంకుల్లో పనిచేసేవారు, 13 మంది ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీలోను, 11 మంది ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోను పనిచేస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి